బాలాజీ విద్యాసంస్థలలో హోలీ సంబరాలు…

బాలాజీ విద్యాసంస్థలలో హోలీ సంబరాలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్,అక్షర ద
స్కూల్లో సోమవారం హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ
కార్యక్రమానికి బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, ట్రెజరర్
డాక్టర్ ఏ. వనజ మేడమ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్.ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హోలిని రంగుల పండుగ అని పిలుస్తారన్నారు. హోలి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అన్నారు. హోలి పండుగ చెడుపై మంచి, అబద్దం మీద సత్యం,దు:ఖంపై సంతోషం సాధించిన విజయాన్ని సూచిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు రంగులు చల్లుకొని ఆనంద డోలికల్లో తేలియాడారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్. జ్యోతి గౌడ్,
అక్షర ద స్కూల్ ప్రిన్సిపాల్ జి.భవాని, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version