అల్లాడి పౌల్ రాజ్ పిలుపు
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు స్థానిక ASR కాలనీ లో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం పుట్ట రవి అధ్యక్షతన నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ…. ఢిల్లీ లోని జంతర్ మంతర్ లో ఆగస్ట్ 9న జరిగే మాలల మహాధర్నాన్ని జయప్రదం చేయాలని అన్నారు. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యలో జరిగే ధర్నాకు మాల మేధావులు, మాల ఉద్యోగులు,మాల విద్యార్ధులు, మాల యువకులు, మాల మహిళలు ఐక్యత తో ఢిల్లీ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బర్ల రామకృష్ణ, బట్ట రాఘవులు,సామెల్,నాని బాబు, శ్యామ్,రాజు, కృష్ణ, శ్రీను, సందీప్,హరీష్ ఏసు, తదితరులు పాల్గొన్నారు