ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా

వావిలాల ని మండలం చేసి చూపిస్తా

ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

నేను రాజకీయాల్లోకి వచ్చిందే మీ మొహంలో చిరునవ్వు చూడడం కోసమని, ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట మండలంలోని
నాగారం, నగురం, వావిలాల,పాపక్కపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను ఫనంగా పెట్టి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. సాధించిన తెలంగాణను ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పదానికి నడిపించిన మహర్షి కేసీఆర్ అన్నారు. ఏక్కడ లేని విధంగా 24 గంటల కరెంటుతో పాటు 19 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ పాలన ఢిల్లీకి వెళ్తుందని. మరోసారి తెలంగాణ ప్రజలు ఢిల్లీ చేతుల్లో బానిసలు అవుతారని అన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రం అంధకారంలోకి పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొత్త మేనిఫెస్టో రూపొందించారని. మేనిఫెస్టోలో పేద ప్రజల అభ్యున్నతి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇందులో ముఖ్యంగా కెసిఆర్ ధీమా ఇంటింటికీ భీమా అని తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా పోషకులు మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నామని అన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకంతో ప్రతి మహిళకు నెలకు 3 వేల రూపాయాలు అందజేయనున్నామన్నారు. దీంతోపాటు గ్యాస్ సిలిండర్ ని కూడా కేవలం 400 కే అందజేస్తామన్నారు. అంతేకాకుండా అన్నపూర్ణ పేరిట తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీని కూడా ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామన్నారు. పెన్షన్ కూడా దఫలవారీగా 5000 వరకు పెంచుతామని, వికలాంగుల పెన్షన్ కూడా 4000 నుంచి 6000 రూపాయలకు పెంచనున్నామన్నారు. బీసీ బందు, గృహలక్ష్మి పథకాలు పెట్టుకున్న అందరికీ కూడా ఎలక్షన్ అనంతరం చెక్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాన్ని తీసుకొచ్చిందని, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు.. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదన్నారు. నన్ను గెలిపించిన వెంటనే వావిలాలను మండలం చేసి చూపిస్తా అన్నారు. మీ దండం పెట్టి అడుగుతున్న హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరారు. ఈ కార్యక్రమాల్లో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోల్నేని సత్యనారాయణరావు, నాగారం సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపీటీసీ తిరుపతిరావు , నగురం సర్పంచ్ రాజేశ్వర్ రావు, లింగారావ్, వావిలాల ఎంపీటీసీ మర్రి మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్, ప్రసాద్, పాపక్కపల్లి గ్రామ అధ్యక్షుడు భుజంగరావు, గ్రామ సర్పంచ్ మహేందర్, నాయకులు రాములు కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

అమ్ముడుపోయిన నాయకులను ఊళ్ళలోకి రానివ్వకండి

బిఆర్ఎస్ పార్టీ కండువా మీద గెలిచి వేరే పార్టీకి వెళ్లిన నాయకులను ఊళ్ళ లోకి రానివ్వ వద్దని అన్నారు. జమ్మికుంట జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ బిజెపి పార్టీకి కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. డబ్బులకు అమ్ముడుపోయిన నాయకుడు మీకు ఏ విధంగా సహాయపడతాడు మీరే ఆలోచించుకోవాలన్నారు.అలాంటి నాయకులు ప్రచారం కోసం మీ ఊర్లలోకి వస్తే చీపుర్లు తిరిగేయాలన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నాయకుల పై అప్రమత్తంగా ఉండి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version