మహోదయలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం లింగంపేటలో మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ మాట్లాడుతూ… భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం. దాంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన నమ్మాడు. పిల్లలు పూర్తిగా వికసించటానికి సంరక్షణ, పోషణ అవసరమయ్యే మొగ్గల వంటివారని ఆయన తరచుగా చెబుతూ ఉండేవాడు. బాలల దినోత్సవం అనేది పిల్లల అమాయకత్వం, ఉత్సుకత, శక్తి, ఉత్సాహాన్ని జరుపుకునే రోజు. బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, బాలల హక్కులు, వారి సంక్షేమం మరియు వారి భవిష్యత్తు భద్రత గురించి ఆలోచించడానికి సమయం దొరికిన సందర్భం. పండిట్ నెహ్రూ గొప్ప కృషికి గుర్తు చేసుకోవడానికి, నివాళులర్పించే రోజు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు, భారతదేశాన్ని పునర్నిర్మించడంలో, ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఇంకా బలోపేతం చేయడంలో పండిట్ నెహ్రూ పోషించిన పాత్రను భారతదేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. బాలల హక్కులు, వారి సంక్షేమం, వారి సంతోషం గురించి సమాజానికి అవగాహన కల్పించడమే బాలల దినోత్సవం ఉద్దేశం. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ రోజున పిల్లల హక్కులను, వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి సవాళ్లను గుర్తించి, వారికి మంచి ప్రగతిని అందించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పండిత జవహర్ లాల్ నెహ్రూ పిల్లలను దేశ భవిష్యత్తుగా భావించి, వారికి గౌరవం ఇవ్వడం మరియు వారి అభిరుచులు, కలల పట్ల శ్రద్ధ చూపించడంలో నమ్మకం కలిగేవారు. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవం ద్వారా పిల్లల పట్ల సమాజం జాగృతమవడం, వారి హక్కులు మరియు అవసరాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం, ప్రేమ, పాఠశాల విద్యను అందించడంతో పాటు, వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఈ రోజుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల రేణుక, మెంగలి కవిత, కముటం స్వప్న, ఇందూరి సౌమ్య, దురిశెట్టి లయ, ఎండి. పహిమ బేగం, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version