నర్సంపేట టౌన్, నేటిధాత్రి :
తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం సందర్భంగా పట్టణంలోని బాలాజీ విద్యా సంస్థల్లో భాగమైన అక్షర ద
స్కూల్, ద్వారకపేట్ రోడ్ లో గల బిట్స్ స్కూల్ లో వన మహోత్సవం వేడుకలు ఘనంగా
నిర్వహించారు.పాఠశాలలోని చిన్నారులు ఆకుపచ్చని వేషధారణ లో గ్రీన్ డే
వాతావరణం సంతరించుకుంది. పాఠశాల ప్రాంగణంలో బాలాజీ సంస్థల చైర్మెన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మెక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ మానవాళికి అటవీ సంపద ఎంతో అవసరం వుందని వృక్షో రక్షిత రక్షిత: మొక్కలను పెట్టి మనం వాటిని సంరక్షిస్తే అవి మనల్ని సంరక్షిస్తాయని అన్నారు. దీంతో ఆరోగ్యం
బాగావుండాలంటే మొక్కలకు ఎంతో ప్రాధాన్యత వుందని, ప్రతి ఒక్కరూ కూడా తన ఇంటి వద్ద మొక్కలు నాటి సంరక్షణ చేయాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. జ్యోతి గౌడ్ మాట్లాడుతూ కాలుష్యాన్నీ నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి సంరక్షణ చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమములో బాలాజీ విద్యా సంస్థల ట్రెజరర్ వనజ, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి సిఏఓ సురేష్ ఉపాధ్యాయ బృదం, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.