# మాకు పాఠశాల ఎక్కడ…! చిన్నారుల ఆరోపణలు..
# ఆరు సంవత్సరాల గా చెట్ల కింద విద్యాబోధన
# వంట మనిషి ఇల్లు పాఠశాలగా మారిన వైనం
# కనువిప్పు కలగని అధికారులు
# వానొచ్చిన ఎండ వచ్చిన చెట్లే తమకు పాఠశాల
# శిధిలావస్థలో పాఠశాల భవనం
#నెక్కొండ, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగైన విద్య అందించాలని దృపథంతో నాటి కెసిఆర్ ప్రభుత్వం బాల బాలికలకు మైనార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ల ద్వారా వసతితో పాటు నాణ్యమైన విద్యను అందించుటకు పలు హాస్టలను ఏర్పాటు చేసి విద్యను అందించ సాగింది.కానీ రోజురోజుకు ప్రభుత్వాలు మారిన కానీ గిరిజన విద్యార్థుల తలరాత మారడం లేదు. నెక్కొండ మండలంలోని కూతవేటు దూరంలో ఉన్న గొల్లపల్లి గ్రామ పరిధిలోని గేటుపల్లిలో ఉన్న ప్రైమరీ స్కూల్ ను పట్టించుకోకపోవడం స్థానిక విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గేటుపల్లి లో ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల పురాతనంగా ఉండేది గత రెండు సంవత్సరాల క్రితం శిథిలావస్థకు గురై తరగతి గదులలో ఉన్న విద్యార్థులపై స్లాప్ పెచ్చులు పడడంతో నాటి ఉపాధ్యాయులు పలుసార్లు ఉన్నత అధికారులకు సమాచారం అందించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న వ్యక్తి తన ఇంట్లో ఆరుబయట చెట్ల కింద విద్య బోధన చేసేందుకు సహకరించగా నేటి వరకు కూడా అదే చెట్టు కింద వానొచ్చిన ఎండొచ్చినా ఏడు సంవత్సరాల నుండి గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గేటుపల్లి మరియు చుట్టుపక్కల తండాల నుండి నిరుపేద విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించడానికి వస్తుండేవారని కానీ ఉన్న పాఠశాల శిథిలావస్థకు గురై సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోకపోవడంతో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల లకు పంపలేక ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేక వారి చదువు అర్ధాంతరంగా ముగుస్తుందని గేటు పల్లి మరియు చుట్టుపక్క తండావాసులు వాపోతున్నారు. అంతేకాక ఎన్ని ప్రభుత్వాలు మారిన తమ స్కూలును పట్టించుకోవడంలేదని ఇకనైనా స్థానిక నాయకులు మరియు ఉన్నత అధికారులు స్పందించి తమ పాఠశాలను పునర్నిర్మాణం చేసి తమ పిల్లల చదువుకు తోడ్పడాలని ప్రాధేయ పడుతున్నారు.
@ ప్రభుత్వాలు మారిన మారని గిరిజన విద్యార్థుల తలరాత
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన తమ గ్రామంలో సరైన పాఠశాల లేదని తమ పిల్లలు చదువుకోవాలంటే రెండు కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందని చిన్న చిన్న పిల్లలు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గత పాలకులకు పలుసార్లు విన్నవించుకున్నామని కానీ ఎలాంటి ఉపయోగం లేదని ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవ తీసుకొని పాఠశాల పునర్నిర్మాణం చేసి గిరిజన విద్యార్థుల తలరాతలు మార్చాలని స్థానికులు వేడుకుంటున్నారు.
@ వంట మనిషి ఇల్లును పాఠశాలగా మార్చిన వైనం..
గొల్లపల్లి గ్రామంలోని గేటుపల్లికి చెందిన ప్రైమరీ పాఠశాల శిధిలావస్థకు గెలవడంతో అదే పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న ఎండి సలీమా బి సహృదయంతో స్పందించి తమ ఇల్లును పాఠశాలగా చేసి ఆరు సంవత్సరాల నుండి తమ ఇంటి ముందు ఉన్న వరండాలో మరియు చెట్ల కింద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పలుసార్లు ఉన్నత అధికారులు వచ్చి వెళ్తున్నారే తప్ప విద్యార్థులకు పాఠశాల ఏర్పాటు చేయడం లేదని విద్యార్థులు చిన్నపిల్లలు కావడంతో మూత్ర విసర్జన చేసుకోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఇకనైనా వెంటనే స్పందించి గిరిజన విద్యార్థులైన విద్యార్థులకు వెంటనే పాఠశాల ఏర్పాటు చేయాలని వంట మనిషి ఎండి సలీమా బి అన్నారు.