జాతీయ జెండాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ కలిసి ఎగురవేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి డివిజన్ లోగల GHMC జోనల్ కార్యలయంలో గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన జాతీయ జెండాను జోనల్ కమిషనర్ స్నేహ శబరీస్ తో మరియు తదితర డివిజన్ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు, పుర ప్రముఖులతో కలిసి ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ వార్డ్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు హబీబ్ భాయ్, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ వార్డ్ మెంబర్ శ్రీకళ, రాంబాబు, గోపాల్ యాదవ్, రవి యాదవ్, కొయ్యాడలక్ష్మణ్ యాదవ్, సుభాష్, సీనియర్ నాయకులతో కలిసి సుదర్శన్ నగర్ కాలనీ, గోపి నగర్, ఆదర్శ్ నగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హుడా ట్రేడ్ సెంటర్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, లింగంపల్లి విలేజ్ రావ్వ్స్ జిమ్, జయశంకర్ చౌరస్తా, ఎంపీపీఎస్ సురభి కాలనీ, ఆర్ జి కే సెంటర్, ఆరంభ టౌన్షిప్, బాపునగర్ హనుమాన్ యూత్, మసీద్ బండ సర్కిల్, ఇందిరా నగర్, గచ్చిబౌలి స్ట్రీట్ నెంబర్ 3, చిన్న అంజయ్య నగర్ మరియు పలు కాలనీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు, బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు, యువ నాయకులు, బస్తీ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్లు, మహిళా నాయకురాళ్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.