ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
వీరుడు వడ్డే ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఓబన్న చిత్ర పటానికి ఎమ్మెల్యే పూల మాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా వడ్డే ఓబన్న పోరాడారని పేర్కొన్నారు. తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని అన్నారు. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శైలజ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రవీందర్
వడ్డెర సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లయ్య ప్రధాన కార్యదర్శి రవి ఉపాధ్యక్షులు విజేందర్ జిల్లా కన్వీనర్ రవి మండల అధ్యక్షుడు సారయ్య తదితరులు పాల్గొన్నారు