శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కూడలి వద్ద దేశ స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ మండలంలో కూడలి వద్ద తెలంగాణ కొమురయ్య ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి దేశ స్వతంత్ర భారతావని కోసం ప్రాణ త్యాగాలను, స్వాతంత్ర సమరయోధుడు ఫోటోకు పూలమాల వేసి చంద్రశేఖర్ ఆజాద్ మన దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ రాజ్యాంగంపై పోరాటం చేసే యుద్ధం చేసి ప్రాణాలకు లెక్కచేయకుండా మన దేశ స్వతంత్రం తెచ్చినారు. చంద్రశేఖర్ ఆజాద్ వీరి ఆశయాలను సాధించాలని కోరుచున్నాం, ఇదేవిధంగా స్వతంత్ర సమరయోధులు లాగా తెలంగాణ ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధుల పింఛన్లు ఇవ్వాలని చంద్రశేఖర్ ఆధ్యాత్ వర్ధంతి సాక్షి సాక్షిగా కోరుచున్నాం, ఈ కార్యక్రమంలో ఓడేడు సదయ్య ముత్తయ్య రాచకొండ సదానందం సారయ్య సదయ్య కొమ్ముల పాణి భాషను రాజు మల్లయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.