ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు పలువురి శుభాకాంక్షలు.
అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హంద్, తో మారుమోగిన ఈద్గా లు.
ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేక బందువస్తు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఉమ్మడి మండలంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం, ఈద్గా ల వద్ద ఈ దుల్ ఆజ్ హా, వేడుకలను చేపట్టి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. సోమవారం రోజు ఈదుల్ అజా బక్రీద్ సందర్భంగా మండల కేంద్రంలోని ఈద్గా జామి మజీద్ మదిని ఈద్గా, ల వద్ద బక్రీద్ ప్రత్యేక ఖుద్బ ను మత గురువులు పటించారు,బక్రీద్ యొక్క ప్రత్యేకత ప్రవక్త ఇబ్రహీం, అల్లా యొక్క ఆదేశా పాలన, తన సంతానాన్ని అల్లాహ్ కొరకు త్యాగం చేయడానికి ఆచరిస్తూ, పవిత్ర బక్రీద్ తోపాటు హజ్ యాత్ర పూర్తి కావడం జరుగుతుంది. మండలంలోని కాలేశ్వరం, పంకెన గ్రామాల్లోని ఈద్గా లో బక్రీద్ ప్రత్యేక ఖుద్బ ను పాటించడం జరిగింది. అనంతరం ఈదుల్ అజ్హా, నమాజ్ ను చదవడం జరిగింది. అనంతరం మండలంలో ముస్లింలు కుర్బానీ కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. బక్రీద్ ప్రత్యేక ఖుద్బ అనంతరం అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్ల హు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లా హిల్ హంద్, ఆయత్ ను ఈద్గాల్లో అందరూ కలిసి పట్టించడం తో ఈద్గాలు మారుమోగాయి. బక్రీద్ పండుగ కార్యక్రమాలు బుధవారం నాటికి కొనసాగనున్నాయి. పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా పలు రాజకీయ నాయకులు ఈద్గాల వద్దకు చేరి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈద్గాల వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లు ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.