నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయఅన్నారు.సోమవారంచండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలోఏర్పాటుచేసినవరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఆ పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసిఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుకాలంకష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితిఏర్పడిందన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులను తేమ శాతం పేరుతోరైతులను రోజుల తరబడికొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో సాగు కోసంరైతు చేసిన అప్పులు తీర్చలేకఆత్మహత్యలు చేసుకుని స్థితికివస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనిఆయన అన్నారు.ధాన్యం కొనుగోలనువేగవంతం చేయకపోవడంతోరైతులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తేమతో నిమిత్తం లేకుండాధాన్యమునుకొనుగోలు చేయాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్నిఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యము కొనుగోలు చేయకపోవడంతో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుంది ఏమోనని భయాందోళనకు గురవుతున్నారనిఆయన అన్నారు.ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కమిటీ సభ్యులుచిట్టిమల్ల లింగయ్య, ఆ గ్రామ రైతులు బి.నరసింహ,కె.రామలింగం,గంట గణపతి, బోయపల్లి శివలింగంతదితరులు పాల్గొన్నారు.