పరకాల నేటిధాత్రి
శనివారం రోజున రోజున హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో జరిగే అఖిలభారత ప్రభుత్వ ఉద్యోగుల సదస్సు జయప్రదం చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్ పిలుపునిచ్చారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు అనేక సమస్యలు పరిష్కారం కాకుండా మరుగున పడ్డాయని ఆయన విమర్శించారు.అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ పనిచేస్తుంది.317 జీవో రద్దు చేయాలి,కొత్త పెన్షన్ విధానాన్ని సీపీఎస్ ను రద్దుపరిచి పాత పెన్షన్ విధానం ఓపిఎస్ విధానం కొనసాగించాలి,ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు పూర్తిస్థాయిలో చికిత్సలు
అందించాలని పలు అంశాలపై మాట్లాడటం జరిగింది.