రియల్ ఎస్టేట్ చేతుల్లో ప్రభుత్వ భూమి..
ఆక్రమించాడని అడుగుతే గ్రామస్తులను బెదిరిస్తున్న రియల్ వ్యాపారి.
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు రైతులు
దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ శివారులో రాతిమాటు కాలువ కబ్జా..
ఒక్కరోజులోనే అక్రమ కట్టడాలు పూర్తి..
కాల్వ భూమిని కాపాడాలంటూ రైతుల వేడుకోలు..
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలో రోజురోజుకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందా మితిమీరి పోతున్నది. ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడితే అక్కడే పక్కనే ఉన్న ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి ప్రభుత్వ భూములు వాగు కాలువలను వదలకుండా ఒక్క రోజుల్లోనే రూపురేఖలు మారుస్తున్నారు. అక్రమ సంపాదన ధ్యేయంగా కొందరు రియల్ వ్యాపారులు చోట మోట లీడర్ల సహకారంతో పచ్చని పంటలను సర్వనాశనం చేస్తున్నారు. ఇదే క్రమంలో దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం గ్రామ సమీపంలో గల జేరిపోతుల వాగు రాతిమాటు కుడికాలువ క్రింద సుమారు 100 ఎకరాల భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే వరంగల్ కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాతిమాటు పక్కన గల ఒక ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసుకున్నాడు.కాగా రాతిమాటు కాలువను అక్రమంగా పూర్తి అక్రమ నిర్మాణాలు చేపట్టారని మాజీ ఎంపిటిసి మామునూరు సుమన్,మాజీ రైతుబంధు సమితి సమన్వయకర్త బొమ్మగాని రవికుమార్, మాజీ విడిసి చైర్మన్ లు ఆరోపించారు.రాతిమాటు కాలువను అక్రమంగా కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని సంబంధిత రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని పేర్కొన్నారు. కాల్వ కబ్జా చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడగగా భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగించి లక్ష్మీపురం గ్రామ రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను ప్రజావాణి ఫిర్యాదు ద్వారా కోరినట్లు వారు పేర్కొన్నారు.
రాతిమాటు కుడికాలువ కబ్జా పట్ల ఎమ్మార్వో ఫిర్యాదు..
దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం గ్రామ సమీపంలో గల జేరిపోతుల వాగు రాతిమాటు కుడికాలువ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ మంగళవారం దుగ్గొండి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో లక్ష్మీపురం గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. సుమారు 100 ఎకరాలు భూమిని సాగు చేసుకునే కాలువ కబ్జాకు గురికావడం వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి ఎదుగుతున్నదని వెంటనే తహాసిల్దార్ విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పాల్గొని కాపాడాలని రైతుల కోరారు. లేనిపక్షంలో ఎమ్మార్వో కాలేయ కార్యాలయం ముందు గ్రామ రైతులు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామునూరి సాంబయ్య, దార స్వామి,మామునూరి ఎల్లాస్వామి, రవి మల్లయ్య,ముద్దం కుమార్ లతోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు.