పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ,మండల కమిటీ ఆధ్వర్యంలో 2024 నూతన కాలేజీ కమిటీలు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో వేయడం జరిగింది.ఈ యొక్కకమిటీ నిర్వహణ కార్యక్రమానికి మడికొండ ప్రశాంత్ మండల అధ్యక్షులు,బొజ్జ హేమంత్ జిల్లా కమిటీ సభ్యులు,బొచ్చు ఈశ్వర్ పట్టణ అధ్యక్షులు కార్యక్రమానికి పాల్గొని కమిటీలను నిర్వహించారు.ఇందులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా యశ్వంత్,ఉపాధ్యక్షులుగా సౌమ్య,కార్యదర్శిగా రాజేష్, ఉప కార్యదర్శి శ్యామ్ లను కాలేజీ కమిటీ ఎన్నుకోవడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు మండల నాయకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
