పాట చిత్రీకరణలో గర్ల్ ఫ్రెండ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ద గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో…
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ద గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విధ్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ అందమైన ప్రేమకథకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ప్రస్తుతం రశ్మిక, దీక్షిత్‌పై పాట చిత్రీకరిస్తున్నారు. టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామనీ, ఈ నెలలోనే పాటను విడుదల చేస్తామనీ నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాకు కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణాన్ని, హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.