శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
గణపతి మండపాల్లో డీజే లకు అనుమతులు లేవు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్త వహించాలి
ఏసిపి పంతాటి సదయ్య
మందమర్రి, నేటిధాత్రి:-
గణేష్ నవరాత్రి ఉత్సవాలను
శాంతియుత వాతావరణంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంస్కృతి సాంప్రదాయాలు సామరస్యాన్ని కాపాడుకుంటూ సంతోషాల నడుము జరుపుకోవాలని ఏసిపి పంతాటి సదయ్య అన్నారు. మందమర్రి పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మందమర్రి పట్టణ సిఐ మహేందర్ రెడ్డి అధ్యక్షతన
వినాయక ఉత్సవ కమిటీ, నిర్వాహకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి పంతాటి సదయ్య ముఖ్యఅతిథిగా హాజరై నిర్వాహకులకు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని,
హోరెత్తించే డీజే మోతలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. పిల్లలు, మహిళలు, యువకులు తారతమ్యం లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహం నింపుతుంది. అటువంటి ఈ పండుగలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
విగ్రహం సైజు బరువు ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు నిమజ్జనం తేదీ కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే పోలీసువారికి తెలియజేయాలేని, ఆన్లైన్ ద్వారా నిర్వాహ కమిటీ వారు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
వినాయక మండప ఏర్పాటు విషయంలో గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలని, విరాళాల సేకరణలో దాతల నుండి బలవంతపు వసూళ్లు చేయరాదని, అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు అనుభవజ్ఞులైన వారి ద్వారా విద్యుత్ కనెక్షన్ పనులు చేయించుకోవాలని, విద్యుత్ శాఖ వారి సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. వివాదాస్పద స్థలాల్లో, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ప్రదేశాల్లో మండపాలు నిర్మించకూడదని,
రాత్రి సమయాలలో మండపాల వద్ద కాపలాగా ఇద్దరు వ్యక్తులు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే వాటికి నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వాడాలని, నూనెతో దీపాలు వెలిగించే సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని. అగ్నిప్రమాదాలు లాంటివి జరిగితే వాటిని వాటి తీవ్రతను తంగ్గించెందుకు సరిపడినంత నీరు, ఇసుక అందుబాటులో ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నిమజ్జనానికి విఘ్నేశ్వరుడిని ఊరేగింపుగా తరలించే రోజు పోలీసులు నిర్దేశించిన దారిలోనే వెళ్లాలని, గణేష్ మండపాల దగ్గర కాని, ఊరేగింపు సందర్బాలలో మద్యం సేవించకూడదని అన్నారు. ఊరేగింపు జరుతున్న సమయంలో మసీదులో ముస్లింలు ప్రార్ధన చేస్తున్న సమయంలో ఎలాంటి సౌండ్ లేకుండా మసీద్ లను దాటించాలన్నారు. నిమజ్జనం జరిగే చోటుకి పిల్లలను, మహిళలను తీసుకు వెళ్ళకూడదని, వీధులల్లో ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఎదురెదురుగా విగ్రహాలు రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు చంద్రకుమార్, రాజశేఖర్, గంగారాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.