ఎస్ఐ దూలం పవన్ కుమార్.
మరిపెడ నేటి ధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే వారు అనుమతులు తీసుకొని పోలీసులకు సహకరించాలని మరిపెడ ఎస్ఐ దూలం పవన్ కుమార్ నిర్వాహకులను కోరారు,గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆర్గనైజర్ పేరుతో పాటు, ఫోన్ నెంబర్, గణేష్ విగ్రహాల ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ మరియు స్థలంను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీలను కోరడం జరిగింది