ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన గణనాధునికి పూజారి వినయ్ శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు చేసినారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర దంపతులు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుని వేడుకున్నామని తెలిపారు అనంతరం జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం కు గణపయ్యను టాటాఎసి గూడ్స్ వాహనంలో కాళేశ్వరం గోదావరి త్రివేణి సంగమానికి సాగనంపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు