కూకట్పల్లి, జూలై 12 నేటి ధాత్రి ఇన్చార్జి
వర్షాకాలం నేపథ్యంలో 124 డివిజన్ పరిధిలోని శంషిగూడ ప్రభుత్వ పాఠశా లలో దోమల నివారణ భాగంగా జిహెచ్ ఎంసి ఎంటమాలాజీ సిబ్బంది దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధులపై విద్యా ర్థులకు అవగాహన సదస్సు నిర్వహిం చడం జరిగింది.ఈ కార్యక్ర మానికి ము
ఖ్య అతిధిగా డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం గురించి వి ద్యార్థులకు వివరించారు.ఈ సంద
ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఏంటమలాజీ సూపర్వైజర్ డి నర సింహులు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లని అన్నారు. మన ఇంటి ఆవరణలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్నచో అట్టి నీరును తనిఖీ చేసి పార బోయాలని అన్నారు.అట్టి నీటిలో దోమ లు గుడ్లు పెట్టి గుడ్డు నుండి దోమగా రూపాంతరం చెందడానికి వారం రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఈ వారం రోజుల లోపల ఆ దోమ యొక్క కాలా చక్రాన్ని మనం బ్రేక్ చేసి, దోమల ఉత్ప త్తిని అరికట్టాలని అన్నారు. దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధులపై అవగా హన సదస్సుకు ప్రతి ఒక్కరూ హాజరు కావా లని, అదేవిధంగా ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి నీటి నిల్వలను తనిఖీ చేసే ఎంట మాలజీ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహ కరించాలని కార్పొరేటర్ తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల హైస్కూల్ ఎచ్.ఎం నరసిం హులు, ప్రైమరీ స్కూల్ ఎచ్.ఎం సుంద రరావు, పాఠశాల ఉపా ధ్యాయులు,విద్యార్థులు,ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.