ఇకపై మీ-సేవ సర్టిఫికెట్లు వాట్సాప్లోనే.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మీసేవ వాట్సప్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం. సీఎం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇకపై మీ-సేవ ద్వారా పౌరులు దరఖాస్తు చేసుకునే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం ఎలాంటి సర్టిఫికెట్ అయినా నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే, డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికెట్ ను, వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం. దీంతో ప్రజల సమయం, శ్రమ ఆదా కానుంది.
