టాస్కా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తొలి సమావేశం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు టాస్క ఆధ్వర్యంలో చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన కోడం నారాయణ కార్యనిర్వహణలో దొంత దేవదాసు వ్యాఖ్యానంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ఈసీ మెంబర్స్ డైరీలో కార్యవర్గం ఫోటోలతో రావడానికి తగిన సూచనలు పాటించాలని కోరారు. అదేవిధంగా న్యాయ కమిటీని ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న సత్వరమే వారికి సంబంధించిన కేసు పూర్వపరాలను చర్చించి తల్లిదండ్రుల ను పోషణ బాధ్యత పిల్లలదే కాబట్టి సత్వర పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల వేదనను దూరం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ ఏ కేసు నైనా సత్వరమే పరిష్కరించే పనిలో ఉందా మన్నారు. ఉపాధ్యక్షులు శ్రీగాదమైసయ్య, ఏనుగుల ఎల్లయ్య, ఎనుగుల లక్ష్మీనారాయణ, న్యాయ కమిటీ పెద్ద వికృతి ముత్తయ్య గౌడ్, ఆడిట్లో పెద్ద అంకారపు జ్ఞానోబా పకడిబందీగ, వృద్ధులకు న్యాయం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పారు. గౌరిశెట్టి ఆనందం, వేముల వెంకట నరసయ్య, గుడ్ల శ్రీధర్, శ్రీహరి రెడ్డి, పాష మొదలైన వారు పాల్గొన్నారు.
