*నూతన సర్పంచ్ మొదటి జనరల్ బాడీ సమావేశం*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
కొల్లూరులో మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది…జనరల్ బాడీ మీటింగ్ లో బాగంగా కొల్లూరు గ్రామ పంచాయతీ భవనంలో సమావేశం నిర్వహించడం జరిగింది…సమావేశం లో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మరియు ఉపసర్పంచ్,గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ అధికారులు పాఠశాల సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం సిబ్బంధి, వెలుగు మహిళా గ్రూప్ సిబ్బంది, వివో లీడర్లు ,వ్యవసాయ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, వైద్య సిబ్బంది, గ్రామ పారిశుద్ధ కార్మికులతో కలిసి గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతు గ్రామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించాలనీ మరియూ గ్రామ ప్రజలకు,రేపటి పౌరులు పాఠశాల విద్యార్థులకు సేవలు అందించడమే మన ప్రధాన ఈజెండాగా పని చెయ్యాలని గ్రామ స్థాయి అధికారులకు మరియూ వార్డు సభ్యులకు తెలియచేయడం జరిగింది .
