బీడుభూముల్లో నిప్పు: పది ఇళ్ల ఆవరణలకు వ్యాపించిన మంటలు…

బీడుభూముల్లో నిప్పు: పది ఇళ్ల ఆవరణలకు వ్యాపించిన మంటలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, అందోల్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం మండలము కమాల్పల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బీడుభూముల్లో నిప్పు పెట్టారు. ఈ అగ్నిప్రమాదంలో రైతుల వంట చెరుకు, ఎరువు, పశుగ్రాసం పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు పది ఇళ్ల ఆవరణలకు మంటలు వ్యాపించాయి. సరైన వర్షాలు లేక పంటలు పండక రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఈ దుండగుల చర్యతో మరింత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version