రైతులకు వానాకాలం పంట సన్నవడ్లకు బోనస్, యాసంగి పంటకు రైతు బందు ఇవ్వాలి
మాజీ సోసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వాలని, అలాగే యాసంగి వరి నాట్లు వేస్తున్న తరుణంలో రైతు బంధు నిధులు విడుదల చేయాలని గణపురం సోసైటీ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అధికారం కోసం రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతులపై నిర్లక్ష్యం చేస్తుందని, ఎన్నికల ముందు అన్ని పంటలకు గిట్టుబాటు ధర, వరి ధన్యానికి బోనస్ అని చెప్పి గెలిచిన తర్వాత సన్నాలకే అని అదికూడా వానాకాలం పంటకు మాత్రమే అని అంటున్నారని అవికూడా ధాన్యం అమ్ముకొని నెలలు గడిచిన ఇప్పటికి రాలేదని, అలాగే రైతుబంధు 10000 లను 15000 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని నాట్లు వేస్తున్న క్రమంలో పెట్టుబడి సాయంగా వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని పూర్ణచంద్రారెడ్డి కోరారు
