అకాల వర్షాలతో అన్నదాతకు కన్నీళ్లు… పట్టించుకోని అధికారులు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలo కొప్పుల గ్రామానికి చెందిన రైతులు అకాల వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి వాతావరణం మార్పులో భాగంగా ఈదురు గాలులు వచ్చాయి వీటికి తోడుగా మండల పరిధిలో బలమైన ఈదురు గాలులతో పాటు చిన్నపాటి వర్షం కురిసింది ఈదురు గాలుల దెబ్బకు కొప్పుల గ్రామంలోని పలువులు రైతులు సాగుచేసిన అరటి చెట్లు నేలను వాలాయి. ఉద్యాన పంటలైన తీవ్ర ప్రభావం చూపింది. అరటి పంట చేతికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో అరటి చెట్లు పడిపోయాయి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పంటను అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేయడానికి అధికారులు క్షేత్రస్థాయి పరిశీల నలను చేయక పోవడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామలకోటి అలువాల రాములు సాగు చేస్తున్న ప్రకృతి ఈదురుగాలుల బీభత్సానికి ఉద్యానవన పంట అరటి చెట్లు నెలకొరికినట్లు తెలిపారు ఈ నష్టాన్ని అంచనా వేసి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.