రుణమాఫీతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ముత్తారం:- నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో లక్ష రూపాయలు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు గురువారం రోజున రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి లాంఛనంగా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసినందున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీ తో కాంగ్రెస్ నాయకులు రైతులు భారీ ఎత్తున రైతు వేదికకు తరలివచ్చారు రుణమాఫీ చేసే విధానం గురించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు తిలకించారు 12 12 2018 నుండి 9 12 2023 వరకు రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను వర్తిస్తుందని ప్రభుత్వ ప్రకటించింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ ఏ ఈ ఓ లు శ్రీలేఖ సాగర్ హారిక కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *