ఉత్తమ గ్రేడింగ్ తెచ్చుకునే -విద్యార్థులకు మెడల్ బహుకరణ ప్రకటన
-గోరు ముద్ద కార్యక్రమానికి స్వామి వివేకానంద సేవా సమితి తన వంతు సహాయం.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమానికి మూడు వేల రూపాయలు అందజేయడం జరిగింది. కట్ట లింగంపేట గ్రామానికి చెందిన శవాల ఆది మల్లయ్య మృతికి జ్ఞాపకార్ధంగా గోరుముద్ద కార్యక్రమానికి 5000 రూపాయలు అందజేశారు. కీర్తిశేషులైన ఆది మల్లయ్య జ్ఞాపకార్థం పదో తరగతి ఉత్తీర్ణతలో ప్రథమ, ద్వితీయ, తృతీయ గ్రేడు సాధించే విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెడల్స్ భావకరిస్తానని వారి సోదరుడైన శవాల భక్తార్ మరియు నగేష్ ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
వీడ్కోలు సమావేశంలో పిల్లలు నాట్య ప్రదర్శనలతో అలరించారు.
పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులను స్కూలును విడిచిపెట్టి వెళ్లలేక పోతున్నామని బాధను తెలియజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.