ఐ బొమ్మ రవి కేసు.. బెయిల్ వస్తుందా…

ఐ బొమ్మ రవి కేసు.. బెయిల్ వస్తుందా?

 

సినిమా పైరసీకి పాల్పడ్డ ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్‌కు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టులో వాదనలు మిగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.

ఐ బొమ్మ రవి కస్టడీ పిటిషన్లపై వాదనలు మిగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ఐ బొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రవి బెయిల్ పిటిషన్‌‌పై కూడా వాదనలు కొనసాగాయి. కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 4 కేసుల్లో వేర్వేరుగా రవి పైరసీ పట్ల విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వాదోపవాదాలు విన్న కోర్టు బెయిల్ ,కస్టడీ పిటిషన్‌లపై శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version