పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక పరకాల సిఎస్ఐ మిషన్ బెతేల్ అనాధ ఆశ్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి చంద్రకళ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే అభిమానులు బ్రేడ్,అరటిపండ్లు,మామిడి పండ్లు పంపిణి చేయడం జరిగింది.పరకాల నియోజకవర్గంలోని పేద ప్రజలకు మంచి సౌకర్యాలతో ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి మోలుగురి బిక్షపతి చంద్రకళ దంపతులు చిరకాలం అందరి మదిలో ఉంటారని ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముందు ముందు పేదప్రజలకు మరెన్నో సేవలు చేసే భాగ్యం కల్గియ్యాలని ఆ దేవున్ని మనస్సుపూర్తిగా కోరుకుంతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో గోల్కొండ రాజు, సిలివేరు చిరంజీవి,మంద టునిట్,యెల్దoడి సురేష్,భాను రెడ్డి,డ్రైవర్ సంతోస్,లడ్డు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మోలుగురి దంపతుల పెళ్లిరోజు వేడుకలు
