కడియం శ్రీహరి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

సంక్షేమ పథకాలే గెలుపుకు పునాదిరాళ్లు:బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి


చిల్పూర్ జనగామ నేటి ధాత్రి: టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు కొరకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని జనగాం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు చిన్న పెండ్యాల గ్రామంలో బూత్ 106 లో జోరుగా గడప గడపకు భారత రాష్ట్ర సమితి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు కెసిఆర్ ను మూడవ సారి ముఖ్యమంత్రినీ చేయడమే లక్ష్యంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరిని భారీ మెజార్టీ తో గెలిపించడం కోరకు ప్రతి గడపకు వెల్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి,అలాగే ప్రస్తుతం విడుదల చేసిన మేనిఫెస్టో గురించీ ప్రజలకి వివరిస్తూ గడపగడపకు వెళ్లి జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షులు భూక్యా రమేష్ నాయక్ చిల్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మామిడాల లింగారెడ్డి,రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి,ఎంపీటీసీ తాళ్లపల్లి ఉమా సమ్మయ్య గౌడ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ నాయకులు ఇల్లందు సుదర్శన్,ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ గడ్డమీది వెంకటస్వామి,మార్కెట్ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు,గ్రామ శాఖ అధ్యక్షులు ఇల్లందుల హరి బాబూ , మాజీ దేవస్థాన డైరెక్టర్ గజ్జెల దామోదర్,చిల్పుర్ దేవస్థాన డైరెక్టర్ గుంపుల రవీందర్ రెడ్డి, కడియం యువసేన మండల అధ్యక్షులు ఇల్లందుల విజయ్, గుంటీ భీములు,తాల్లపెల్లి క్రాంతి కుమార్,తాల్లపెల్లి రాజ్ కుమార్, తాల్లపెల్లి జగన్నాథం, తాల్లపెల్లి శివ కుమార్, తాల్లపెల్లి స్వామి, వేమునూరి శ్రీనివాస్,తాల్లపెల్లి ఎల్లయ్య, పేరాల నాగభూషణం, న్యాలపోగుల రఘునాథ్,ఇల్లందుల ప్రభాకర్,ఇల్లందుల రాజు, రామగుండం శ్రీనివాస్, రామడుగు సమ్మయ్య, పేరాల రాజమౌళి,శాగ రవి, బత్తిని రాజు , మోటం రాములు,రాజ ఎల్లయ్య, చుక్కా అరుణ్ ,ఇల్లందుల మహేష్
టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version