అమరవాది చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయండి…
ఐదో వార్డ్ మాజీ కౌన్సిలర్ జిలకర మహేష్
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో, ఆరో వార్డుల ప్రజల, మహిళల సౌకర్యార్థం అమరవాది వాగు, చెరువు వద్ద మెట్లు నిర్మించి లైటింగ్ ఏర్పాటు చేసి బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయాలని స్థానిక ఐదో వార్డ్ మాజీ కౌన్సిలర్ జిలకర మహేష్ మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు కు వినతి పత్రం అందజేశారు. మున్సిపాలిటీ కమిషనర్ సానుకూలంగా స్పందించి బతుకమ్మ నిమజ్జనానికి కావలసిన ఏర్పాటు చేస్తామని తెలియజేసినట్లు మాజీ కౌన్సిలర్ తెలిపారు.