పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి నియోజకవర్గం లో మహిళలతో బతుకమ్మ ఆడి పాడి కోలాటం వేసిన మంత్రి.
రాయపర్తి మండలం కొండూరు, కొలన్ పల్లి, పాలకుర్తి మండలం దర్దేపల్లి, దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల సహా పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడారు. కొన్ని చోట్ల కోలాటం ఆడారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, నియోజకవర్గం లో కలియ తిరిగిన మంత్రి.
మహిళలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.