‘‘గుళ్ళల్లో దుష్ట గ్రహాలు’’..ఎపిసోడ్‌ 2

https://epaper.netidhatri.com/view/310/netidhathri-e-paper-5th-july-2024%09

-అంజన్న కోపం.. పాలకులకు శాపం!

-అంజన్న చల్లని చూపులు…పాలకులకు దీవెనలు.

-పదేళ్లలో కేసిఆర్‌ నిర్లక్ష్యం…

-బిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి కారణం.

-కొండగట్టు అంజన్న ఇలవేల్పుగా కవిత పూజలు.

-ఎంపిగా ఎన్నడూ ఇచ్చింది లేదు నిధులు.

-ఎన్నికల ముందు నాయకుల మొక్కులు.

-గెలిచాక గుడి వంక చూడని నేతలు.

-తెలంగాణ వచ్చిందని తిరుపతి వెంకన్నకు కానుకలు.

-విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు నగలు.

-తెలంగాణ దేవుళ్లకు రిక్త హస్తాలు.

-పదేళ్ళలో కేసిఆర్‌ కొండగట్టుకు చేసిందేమీ లేదు.

-మంచినీటి సరఫరా కూడా సరిగ్గా లేదు.

-భక్తులకు కోసం వసతి గృహాలు లేవు.

-కొండగట్టులో కనీసం సెల్‌ టవర్‌ లేదు.

-పదేళ్ళలో కేటిఆర్‌ కొండగట్టు వైపు చూసింది లేదు.

-కవిత చేసిన అభివృద్ధి అంతకన్నా లేదు.

-కొండగట్టులో జరుగుతున్న అవినీతి ఆపాలన్న సోయి రాలేదు.

-అవినీతి ఉద్యోగులను సాగనంప లేదు.

-అవినీతి అరికట్టే చర్యలు ఏనాడు చేపట్టలేదు.

-అడుగడుగునా జరుగుతున్న దోపిడీ ఆపలేదు.

-విజిలెన్స్‌ విచారణ నివేదిక పక్కన పడేశారు.

-ఇంకా ఇంకా దోచుకొమ్మన్నట్లు వారికే సహకరించారు.

-తప్పు చేసిన వారికి అండగా వుండి పాపం మూటగట్టుకున్నారు.

-కళ్లు నెత్తికెక్కిన పనులు చేసి అంజన్న శాపానికి గురయ్యారు.

-పవన్‌ కళ్యాణ్‌ వస్తాడు…దేవుడా అని మొక్కి వెళ్లిపోతాడు.

-ఉప ముఖ్యమంత్రిగా గుడికి రూపాయి విరాళం లేదు.

-కాంగ్రెస్‌ పాలకులన్నా కొండగట్టును పట్టించుకుంటారా!

-పరిపాలనలో బిజీగా వున్నామని అంజన్నను మర్చిపోతారా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత వుంది. నిత్యం కొన్ని వేల మంది భక్తులు తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దేవున్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. వేముల వాడరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన వారిలో ఎక్కువ మంది అంజన్న దర్శనం చేసుకోకుండా వుండరు. అలాంటి కొండగట్టు అంజన్న సన్నిధిలో సమస్యలు తిష్టవేసుకొని వున్నా పాలకులకు పట్టింపు లేదు. తెలంగాణ వస్తే తెలంగాణ ఆలయాలు ఎంతో అభివృద్ది చెందుతాయంటూ ఉద్యమ కాలంలో ప్రజలకు చెప్పిన కేసిఆర్‌ పదేళ్లు పాలించినా, తెలంగాణ ఆలయాల పోషణ జరగలేదు. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణం చేయడం తప్ప మరే ఆలయ అభివృద్దిని కేసిఆర్‌ పట్టించుకోలేదు. ఉమ్మడి పాలకులకు తెలంగాణ ఆలయాలంటే కూడా చిన్న చూపు అంటూ అప్పట్లో కేసిఆర్‌ చెప్పిన మాటలు ఇప్పటికీ ఉద్యమ కారులకు గుర్తున్నాయి. మరి తెలంగాణలోనే అత్యంత మహిమాన్వితమైన దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. అలాంటి దేవాలయాన్ని ఎన్నొ విధాలుగా అభివృద్ది చేస్తారని అందరూ అనుకున్నారు. కాని ఆలయ అభివృద్ది కోసం కేసిఆర్‌ ఏనాడు ప్రయత్నం చేయలేదు. ఇక నిజామాబాద్‌ మాజీ ఎంపి, ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్నను ఇలవేల్పుగా కొలుస్తారని అంటారు. ఆమె ఎప్పుడూ కొండగట్టులో పూజలు, హోమాలు, యాగాలు, సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి జయంతి వేడుకలకు హజరౌతుంటారు. ఎంపిగా ఆమె పోటీ చేసిన సందర్బాలలో, ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో కూడా ఆమె ప్రత్యేక పూజలు ఇక్కడే నిర్వహిస్తుంటారు. అలాంటి కవిత కూడా ఏనాడు కొండగట్టు ఆయల అభివృద్దికోసం పాటు పడలేదు. పైగా 2014లోనే ఆలయంలో కొంత మంది ఉద్యోగులు విచ్చలవిడిగా అంజన్న సొమ్ము దిగమింగుతున్నారని తేలింది. విజిలెన్స్‌ రిపోర్టు కూడా ఇచ్చింది. కాని దానిని కేసిఆర్‌ ప్రభుత్వం పక్కనపెట్టింది. పూజలు, కైంకర్యాల కోసం ఆలయానికి వెళ్లే కవిత ఏనాడు ఆలయ అభివృద్ది మీద రివ్యూ చేసింది లేదు.

ఆలయంలో జరుగుతున్న అవకతలపై చర్చించింది లేదు.

వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది లేదు. కాని అప్పటి బిఆర్‌ఎస్‌ నేతలే అవినీతి పరులైన ఆలయ ఉద్యోగులను వెనకేసుకొచ్చారు. వారిని కాపాడుతూ వచ్చారు. దాంతో ఉద్యోగుల్లో కూడా భయం లేకుండాపోయింది. ఇప్పటికీ అదే ఉద్యోగులు, అక్కడే తిష్ట వేసుకొని, అవినీతిని కొనసాగిస్తూనే వున్నారు. అయినా వారిని కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకోలేకపోతోంది. కొండగట్టులో తిష్ట వేసుకొని వున్న సమస్యల పరిష్కారం గురించి చర్చ లేకుండాపోయింది. ఇప్పటికీ కొండగట్టులో భక్తులకు సెల్‌ ఫోన్‌ సౌకర్యం కూడా అక్కడ లేకుండా వుంది. నడి సముద్రం నుంచి, నల్లమల అడువుల దాకా సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సౌకర్యం వుంటుంది. కాని కొండగట్టులో ఇన్నేళ్లైనా ఏ సెల్‌ కంపనీ టవర్‌ వేయలేకపోయింది. పాలకులు శ్రద్దపెట్టలేదు. ఉద్యోగులుచొరవ చూపలేదు. కొండగట్టులో ఇప్పటికీ సెల్‌ టవర్‌ లేదు. ఇక కొండగట్టులో మంచినీటి సౌకర్యం కూడా మృగ్యమైపోయింది. ప్రభుత్వ ఎలాంటి మంచి నీటి సౌకర్యం కల్పించలేదు. కేవలం షాపుల్లో దొరికే వాటర్‌ బాటిళ్లు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. నిత్యం కొన్ని వేల మంది దర్శించుకునే దేవాయలంలో మంచినీటి సౌకర్యం లేదన్న సంగతి కూడా ఆనాడు కేసిఆర్‌కు తెలియకుండాపోయిందా? కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు కేసిర్‌ కనీసం క్షతగాత్రులను చూసేందుకు కూడా వెళ్లలేదంటేనే ఆయనకు కొండగట్టు మీద ఎంత ప్రేమ వుందో అర్ధం చేసుకోవచ్చు. అయినా పాలకులు అన్న తర్వాత తన ఇష్టమొచ్చిన ఆలయాలను మాత్రమే అభివృద్ది చేస్తామనుకోవడం క్షమించరానిది.అందుకే అంజన్నకు కోసమొచ్చింది. బిఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైంది. ఏపిలో తిరుమలపై అపచారం చేసిన వారిని అక్కడి ప్రజలు ఎలా ఓడిరచారో..ఇక్కడ కూడా కొండగట్టు లాంటి దేవాయల అభివృద్దికోసం కృషిచేయకపోవడం కూడా బిఆర్‌ఎస్‌కు శాపమైంది. ఇప్పటికే కొండగట్టులో చలువ పందిళ్లు వుండవు. దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి నీడ సౌకర్యం వుండదు. ఆయల పరిసరాలలో ఎండాకాలంలో ఎండ వేడికి తట్టుకోలేరు. తిరుమల లాంటి దేవాయాలల్లో భక్తుల సౌకర్యార్ధం దేవాలయ ప్రాంగణమంతా చల్లగా వుండేందుకు కార్పెట్‌ వేస్తారు. దాన్ని ఎప్పుడూ తడుపుతుంటారు. మిగతా ప్రాంతాలలో కూల్‌ పెయింట్‌ వేస్తారు. కాని ఎనాడు కొండగట్టులో ఆ సౌకర్యం కనిపించదు. ఎవరూ పట్టించుకోరు. భక్తుల క్యూ లైన్‌ కోసం శాశ్వతపరిష్కారం చేపట్టరు. క్యూలైన్‌ ఏర్పాటు చేసి, దానిని రేకులతో నిర్మాణం చేస్తే ఎండాకాలమైనా, వానా కాలమైనా పనికొస్తుంది. కాని ఎండా కాలంలో అంజన్న మాలదారణ చేసే భక్తులు ఎక్కువగా వచ్చే సమయంలో తాత్కాలిక క్యూలైన్‌ ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టర్‌కు బిల్లులిస్తారు. ఉద్యోగులు తమ కమీషన్లు జేబులో వేసుకుంటారు.

ఇలా కాంట్రాక్టర్లకు ఏటా తాత్కాలికంగా క్యూలైన్‌ ఏర్పాటు కోసం కాంట్రాక్టు ఇవ్వడం కన్నా, శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయొచ్చు కాని ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు లేవు.

ఉద్యోగులు అందుకు మొగ్గు చూపరు. ఎందుకంటే క్యూలైన్‌ ఏర్పాటుద్వారా కూడా తమ జేబుల్లోకి ఆదాయం వస్తోంది. ఇక కొండగట్టుకు వచ్చే భక్తులకు అవసరమైనన్ని వసతీ గృహాలు లేవు. వాటి మెంటెనెన్స్‌ సరిగ్గా వుండదు. గదులు వున్నాయా? అంటే వున్నాయన్నట్లు తప్ప, ఒక రోజు నిద్రలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి కనీసం కరీంనగర్‌ ప్రజా ప్రతినిధులకు కూడా సోయి లేదు. నా అంత గొప్ప హిందువు ఎవరూ లేరని పదే పదే చెప్పుకున్న కేసిఆర్‌ దేవాయాల అభివృద్దిపై మాత్రం పెద్దగా శ్రద్దపెట్టలేదు. దేవాలయ భూములు కైంకర్యమైపోతున్నా పట్టించుకోలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటి గురించి పట్టించుకోలేదు. ఆ దిశ చర్యలు తీసుకోలేదు. అందుకే పాపం పండిరది…బిఆర్‌ఎస్‌ ఓడిరది. ఇది తెలంగాణ ప్రజలు అనే మాట. కొండగట్టు అంజన్న అంటే ఏపి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు ఎంతో ఇష్టమైనదైవం. ఆయన పవన్‌ జనసేన పార్టీ పెట్టినప్పుడు కొండగట్టుకు వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అంజన్నను దర్శించుకున్నారు. 2022లో వారహి వాహన పూజ కూడా కొండగట్టులోనే తొలుత పూజ కార్యాక్రమాలు నిర్వహించారు. 2024 ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే ముందు కూడా కొండగట్టుకు వెళ్లారు. తర్వాత గెలిచి ఉప ముఖ్యమంత్రి కాగానే కొండగట్టుకు వచ్చారు. ఇలా దేవుడి మీద ఎంతో నమ్మకంతో వస్తున్నారు. అంజన్న ఇలవేల్పు అని చెప్పారు. కాని అంజన్న ఆయల అభివృద్దికి పాటు పడుతానని ఏనాడు చెప్పలేదు. కాని మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ ఏపిలోని దేవాలయాలకు మొక్కులు చెల్లించుకున్నారు. కాని తెలంగాణ ఆలయాల అభివృద్దికి మాత్రం పాటుపడలేదు.

కొత్త ప్రభుత్వమైనా పట్టించుకోవాలి: దేవాదాయ శాఖను పట్టింపు లేని శాఖగా మార్చి, అందులో జరిగే అవినీతి అక్రమాలను గత పాలకులు చూసి చూడనట్లు వదిలేశారు. దాంతో తెలంగాణలోని అనేక ఆలయాల్లో ఉద్యోగులు పెద్దఎత్తున అవినీతి చేశారు. లక్షలకు లక్షలు జేబుల్లో వేసుకున్నారు. దేవుడి సొమ్ము తిన్నారు. కొండగట్టు దేవాలయంలోనే 2014లో తొమ్మిది మంది ఉద్యోగులపై విచారణ జరిగింది. వారు దోషులుగా తేలింది. అయినా వారిపై ఇప్పటి వరకు చర్యలు లేవు. కనీసం కొత్త ప్రభుత్వమైన పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొండగట్టులో జరిగిన అవినీతి మీద దృష్టిపెట్టాలి. దానికి తోడు కొండగట్టు అభివృద్దికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. కొండగట్టులో అనేక సమస్యలు తిష్ట వేసి వున్నాయి. వాటి పరిష్కారానికి కృషి చేయండి. బిఆర్‌ఎస్‌ చేయని పనిని చేసి చూపించండి. దేవుడి ఆశీస్సులు, భక్తుల అభినందనలు అందుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *