ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కమిటీ ఎన్నిక..

ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కమిటీ ఎన్నిక..

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా…..

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పి. గట్టయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని శనివారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య (మెట్రో ఈవినింగ్), ప్రధాన కార్యదర్శి మారపల్లి వేణుగోపాల్ రెడ్డి (ఆంద్రప్రభ), కోశాధికారి అరేల్లి గోపికృష్ణ (మన సమాజం), లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా ఈదునూరి సారంగారావు ( జనం సాక్షి), గౌరవాధ్యక్షులు ఆరంధ స్వామి ( సిటీ కేబుల్), వెంగళదాస్ సంతోష్ (మనం), తాండ్ర సతీష్ (ఆంధ్రజ్యోతి), వర్కింగ్ ప్రెసిడెంట్ కలువల శ్రీనివాస్( జర్నలిస్ట్ ),
ప్రచార కార్యదర్శి గా నాంపల్లి గట్టయ్య (నేటిధాత్రి), ఉపాధ్యక్షులు గంగారపు గౌతమ్ కుమార్ (ప్రజా పక్షం), పిడి రాజేంద్ర ప్రసాద్ (తెలంగాణ గళం), కొండ శ్రీనివాస్ (మన తెలంగాణ), బండ అమర్నాథ్ రెడ్డి (వుదయం), పురుషోత్తం గంగులు (ప్రజా దర్బార్), సహాయ కార్యదర్శులుగా నెల్లూరి శ్రీనాథ్ ( సూర్య), నాసబత్తుల ప్రవీణ్ (నవ తెలంగాణ), దాసరి స్వామి (ప్రత్యక్ష సాక్షి) , ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కొమ్ము సదానందం( విజయ భారతీ), దుర్గం వెంకట స్వామి( టుడేస్ న్యూస్),మోరె రవీందర్(టీ మీడియా) లు ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షులు గట్టయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లిని ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నూతన కమిటీని సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version