ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు
జిల్లా సమీకృత కార్యాలయ భవనము సమావేశ మందిరం లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, ఎస్పీ పుల కరుణాకర్ లతో కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ 3న వస్తుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్ 13 వరకు నామినేషన్ల శృతిని నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు.
భూపాలపల్లి జిల్లాలో 2వ ఓటరు జాబితా సవరణ తుది ఓటరు జాబితా ప్రకారం , అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు అక్టోబర్ 30 వరకు ఓటరు గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 317 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్ కు రెండు కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు.
మతం, కులం ,ప్రాంతం పై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం బెదిరింపులకు చేయడం తప్పుడు ప్రచారాలు చేయడం పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు.
రాజకీయ సమావేశాలు ఆలయాలు మసీదులు చర్చిలు ప్రార్థన స్థలాలు ఉండవద్దని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉండవద్దని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సర్వే సర్వేలయన్స్ బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్సు బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి పై ఫిర్యాదులను ప్రజల 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సివిజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సి విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు , అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటారని అన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ మొదలైన పబ్లిక్ ప్లేస్ లలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తిస్థాయిలో తొలగిస్తామని కలెక్టరేట్ తెలిపారు.
జిల్లాలో కరపత్రాలు ఫ్లెక్సీలు బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా ఎవరు ప్రింట్ చేయమన్నారు వారి ఫోన్ నెంబర్, ఎన్ని ప్రతులు ప్రింట్ చేశారు వంటి వివరాలు తప్పనిసరిగా పేర్కొనాలని , ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు సమాచారం అందించామని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123 125 ప్రకారం అభ్యర్థులకు 6 సంవత్సరాలు నిషేదం, రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఎన్నికల నిర్వహించే సమయంలో సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు ఇతర ప్రాంతాలో జరిగిన వీడియోలు ఇక్కడ జరిగినట్లు ప్రచారం చేయడం, పాత వీడియోలను ప్రచారం చేయడం, ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా అసత్యాలు వదంతులు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ పుల కరుణాకర్ మాట్లాడుతూ అక్రమ నగదు లిక్కర్ సరఫరా జరక్కుండా కట్టురితమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సామాజిక మాధ్యమాలలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని, ఒక మతాన్ని గాని ఒక ప్రాంతాన్ని గాని ఒక వ్యక్తిని గాని కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని, ఇలాంటి ప్రచారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ డి పి ఆర్ ఓ వి శ్రీధర్, పాత్రికేయులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలక్షన్ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version