టీచర్లను వీధి కుక్కలను లెక్క పెట్ట మన్న విద్యాశాఖ..

టీచర్లను వీధి కుక్కలను లెక్క పెట్ట మన్న విద్యాశాఖ

నడికూడ,నేటిధాత్రి:

 

ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి— అచ్చ సుదర్శన్ పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు
భారతదేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్థల చుట్టూ ఉన్న వీధి కుక్కల లెక్కింపు ఇతర అంశాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లు గా ఉపాధ్యాయులను నియమిస్తూ ఢిల్లీ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు నార్త్ వెస్ట్ -ఎ జోన్లో ని వివిధ స్కూల్లో నుంచి 118 ఉపాధ్యాయులను నోడల్ అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.వీధి కుక్కల లెక్కింపునకు ఉపాధ్యాయులను ఉపయోగించాలని విద్యాశాఖ డైరెక్టర్ అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు డిసెంబర్ 5 న సర్కిల్ జారీ చేశారు.ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత గా పరిగణించాలని ఆదేశాలు ఇచ్చారని అన్నారు.ఈ ఉత్తర్వులపై పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ టీచర్ల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ విద్యా విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు.ఈ సమాజంలో టీచర్లు ఎంతోమందిని మేధావులు తయారు చేసే టీచర్లను వీధి కుక్కల లెక్కింపు కు ఉపయోగించడం ఎంత వరకు సమంజసం. ఒకవైపు విద్యా వ్యవస్థలో వెనుక బడుతూ ఉంటే కుక్కలను లెక్క పెట్టమనడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు వీధి కుక్కలను లెక్క పెట్టినట్లయితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించడం తమ వృత్తి గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు.గతంలో కరోనా సమయంలో బార్ షాపు ల దగ్గర ఉపాధ్యాయులను లైన్లో నిలబెట్టడం కోసం ఉపయోగించారు.ఇలాంటి చర్యల వలన ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బతింటుందని అన్నారు.ఇలాంటి పనులను జంతు సంరక్షణ అటవీశాఖ విభాగాలకు అప్ప చెప్పాలని అన్నారు.ఇలాంటి సమస్యలు ఇకముందు కూడా రాకూడదని భావిస్తున్నానని అని అన్నారు.వీధి కుక్కలను లెక్క పెట్ట మనడం,కాకుల లెక్క బార్బర్ బీర్బల్ కథ లాగా ఉంది అని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version