చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయం పాఠశాల ఆవరణలో శనివారం రోజున పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో ముందస్తు హోలీ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ హిందువుల పండగ అయిన హోలీ పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈనెల 25 సోమవారం రోజున హోలీ రోజు సెలవు దినం కావడంతో ముందస్తు వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.