డి.ఐ.జి జోగులాంబ జోన్ శ్రీ ఎల్.ఎస్ చౌహాన్, ఐపీస్ మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, ఐపీఎస్
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జిల్లా కేంద్రంలో గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎంవీస్ కాలేజ్ అవరణలో నిర్వహించే భహిరంగ సభ ఏర్పాట్లు డి.ఐ.జి జోగులాంబ జోన్ శ్రీ ఎల్.ఎస్ చౌహాన్, ఐపీస్ మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, ఐపీఎస్, పరిశీలించారు. సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాటులు పరిశీలించడమైనది.
బందోస్తు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఎస్ ఎన్ గార్డెన్ నందు బందోబస్తు కి వచ్చిన సిబ్బందికి డి ఐ జి బందోబస్తు సూచనలు జారీచేశారు .. ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల సిబ్బంది సంయమానం పాటించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్య మంత్రివర్యుల పర్యటన సజావుగా అయ్యేటట్లు చూడాలని పోలీసు అధికారులకు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీస్ , ట్రైనీ ఐపీస్ చిత్తరంజన్, అదనపు ఎస్పీ రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.