జిల్లాకలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై డా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని చిట్ట చివరి పేద కుటుంబం వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేరే విధంగా అధికారులు కృషి చేసినప్పుడే మహనీయుల ఆశయాలు సాధించినట్లు అవుతుందని అన్నారు.
విద్యనభ్యసించడం వల్ల ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పు వస్తుందనడానికి డా”బాబు జగ్జీవన్ రామ్ జీవితం నిదర్శనమని అన్నారు.బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంలో జగ్జీవన్ రామ్ విద్యనభ్యసించారని,
1936 సంవత్సరం నుండి 1986 వరకు దాదాపు 50 సంవత్సరాలు సీనియర్ పార్లమెంటేరియన్ గా పనిచేసిన ఏకైక వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. 1946లో జగ్జీవన్ రామ్ నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో ప్రజల మన్ననలు పొందారు భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ లో కార్మికమంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడుగా సామాజిక న్యాయాన్ని రాజ్యాంగంలో పొందుపరచబడిందని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సి అభివృద్ధి అధికారి సునీత, డిఆర్డీఓ నరేష్ ,డిపిఓ నారాయణరావు,
తహసిల్దార్లు, ఎంపీడీవోలు వివిధ కులసంఘాల నాయకులు
ఆర్.భద్రయ్య, బి.సారయ్య, సంతోష్ నాయక్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.