మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
వేసవి దృష్ట్యా విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలకు స్టీల్ వాటర్ ఫిల్టర్ ను బహూకరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ దేవరకద్ర బ్లాక్ ప్రేరక్ జగ్గప్ప తన చేతుల మీదుగా ఉపాధ్యాయులకు,విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగ్గప్ప మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో విద్యాభివృద్ధిని పెంచేందుకు ఇ. ఎస్.రామ్మూర్తి నేతృత్వంలో శిక్షణ ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రేరణ, ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాల ద్వారా 1 నుంచి 8. విద్యార్థుల్లో తెలుగు, ఇంగ్లీషు, గణితంలో కనీస సామర్థ్యాలు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ ద్వారా ప్రతి విద్యార్థికి మొదటి స్థాయిలో మూడు, రెండవ స్థాయిలో మూడు అభ్యసన సాధన పుస్తకాలు పూర్తి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధించిన లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల కు వాటర్ ఫిల్టర్ ను బహుమానంగా అందజేసినట్లు జగ్గప్ప తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఫౌండేషన్ చేయూత నివ్వడం అభినంద నీయమని పాఠశాల ఉపాద్యాయులు అశ్విని చంద్రశేఖర్ అన్నారు. పాఠశాల హెచ్ ఎం జి.వెంకటేశ్వర్లు తో కలిసి శిక్షణ ఫౌండేషన్ బ్లాక్ ప్రేరక్ జగ్గప్ప ను శాలువాతో ఘనoగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం జి.వెంకటేశ్వర్లు, ఉన్నత పాఠశాల ఇంచార్జీ హెచ్ ఎం అస్రఖాద్రి, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, బాసిద్ , ఎస్.కల్పన, విద్యా వాలoటీర్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.