జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 2 వ వార్డు ఫక్కీరుగడ్డ,ఆకుదారివాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ 2వ వార్డ్ కౌన్సిలర్ ఆకుదారి మమత రాయమల్లు అర్బన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు అద్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ గండ్ర వెంకటరమణారెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు వైద్యపరంగా పలు గ్రామాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు,పట్టణంలో బస్తీ దవాఖాలు 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది..మెడికల్ కళాశాల ద్వారా సుమారు 50 మంది వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు.భూపాలపల్లిలో బస్సు డిపో,కలెక్టర్ కార్యాలయం,ఎస్పీ కార్యాలయం, కార్మిక శాఖ సబ్ రిజిస్టర్ ఆర్ అండ్ బి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది.
సింగరేణి కార్మికుల కోసం డబుల్ బెడ్ రూమ్ లు సుమారు 1000 మందికి 76 జీ.వో ద్వారా ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది కార్మిక కష్ట సుఖాలలో పాల్గొన్నారు.
ఈ విధంగా భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిది.
కావున 2 వ వార్డులో తప్పకుండా అందరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వగలరు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్,బీ.ఆర్.ఎస్ జిల్లా నాయకులు కొల రాయమల్లు,కాసగోని సమ్మయ్య,మాచర్ల నర్సయ్య,చిదురాల మల్లయ్య,చిన్నల ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ పెద్ది రెడ్డి జనార్ధన్,భూపాలపల్లి కెసిఆర్ సేవ దళం అధ్యక్షులు బుర్ర అశోక్ గౌడ్ జిల్లా యూత్ మనోజ్ గౌడ్ ,బుర్ర మహేష్ గౌడ్,శంకర్ మనోహర్ రాజేష్ పొన్నం రవి,హరి,రఫిక్,లక్ష్మయ్య,రవి,ప్రవీణ్ సన్నీ,బన్నీ, క్రాంతి, నవీన్, తరుణ్, శివ తదితరులు పాల్గొన్నారు.