వృద్ధాప్య దశలో సూర్యుడు..! మరణం తద్యమా ..?

గుట్టు ఛేధించిన శాస్త్రవేత్తలు!

మన ప్రపంచం మొత్తం సూర్యుడి చుట్టూనే తిరుగుతోంది. సూర్యుడు కనిపిస్తే వెలుగొస్తుంది, సూర్యుడు కనిపించకుంటే చీకటైపోతుంది. కానీ ఏదో ఒక రోజు ఆ సూర్యుడు ఎప్పటికీ కనిపించకుండా పోతే? సూర్యుడు అంతమైతే, ప్రపంచం కూడా అంతమైపోతుందా?

చుక్కలు రాలడం మనం చూస్తూనే ఉంటాం. కానీ మన సౌరవ్యవస్థ మధ్యలో మనమంతా సూర్యుడని పిలుచుకునే నక్షత్రం కూడా ఏదో ఒక రోజు అంతం అవుతుందనే మాట మీరెప్పుడైనా విన్నారా? శాస్త్రవేత్తలు మరో 500 కోట్ల సంవత్సరాల్లో సూర్యుడి మరణం తథ్యం అంటున్నారు.

తమ జీవితకాలం ముగిసిన తర్వాత విశ్వంలోని నక్షత్రాలు, సూర్యుడి మరణిస్తారనే అంశంపై శాస్త్రవేత్తలందరిలోనూ ఏకాభిప్రాయం ఉంది. అదే జరిగితే తర్వాత ఏమవుతుందనేది మాత్రం వారికి ఇప్పటికీ తెలీదు. కానీ బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆ రహస్యాన్ని ఛేధించారు. తన జీవితకాలం ముగిసిన తర్వాత సూర్యుడు వాయువు, ధూళితో కూడిన ఓ ప్రకాశవంతంమైన భారీ వలయంగా మారిపోతాడని గుర్తించారు. ప్లానెటరీ నెబ్యూలా దశలోనే దాదాపు 90 శాతం నక్షత్రాల క్రియాశీల జీవితం ముగుస్తుంది, కానీ సూర్యుడిలోనూ ఇలాగే ఉంటుందా అనే దానిపై మాత్రం శాస్త్రవేత్తల్లో నిశ్చితాభిప్రాయం లేదు.

కంటికి కనిపించే స్థాయి ప్లానెటరీ నెబ్యూలాను ఏర్పాటు చేసేంత ద్రవ్యరాశి సూర్యుడిలో లేదన్న భావనే దీనికి కారణం. ఈ సందేహాన్ని తీర్చుకోడానికి శాస్త్రవేత్తలు ఒక నమూనాను అభివృద్ధి చేశారు. దీని సాయంతో విభిన్న ద్రవ్యరాశులు, వయసు మళ్లిన నక్షత్రాలు తమ చరమాంకంలో వెదలజల్లే వాయు, ధూళి వలయం ఎంత ప్రకాశవంతంగా ఉంటుందనేది నిర్ధరించారు. దీని ప్రకారం.. ఒక తార మరణించినప్పుడు వెలువడే ధూళి, వాయు వలయం సదరు నక్షత్ర ద్రవ్యరాశిలో సగం ఉంటుంది. దీనివల్ల తారలోని కోర్‌ భాగం బహిర్గతమవుతుంది. అప్పటికి దీనిలో శక్తి దాదాపుగా నశించిపోతుంది. ఈ వేడి కోర్‌ భాగమే వాయు, ధూళి వలయాన్ని ప్రకాశవంతంగా చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పది వేల సంవత్సరాల పాటు అది వెలుగులు చిమ్ముతుందని, దీనివల్లే ప్లానెటరీ నెబ్యూలాను చూడగలుగుతున్నామని తెలిపారు. సూర్యుడు తక్కువ ద్రవ్యరాశి కలిగిన నక్షత్రమే అయినప్పటికీ కంటికి కనిపించే స్థాయి నెబ్యూలానే వెలుగు చిమ్ముతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version