స్థానిక నిరుద్యోగ కళాకారులకు ప్రోగ్రామ్స్ ఇవ్వండి
నిజాంపేట, నేటి దాత్రి
నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు వల్లపు సామి మాట్లాడుతూ ఉద్యమం లో కీలక పాత్ర పోసిస్తూ కలనే నమ్ముకొని జీవిస్తున్నాము అలాంటి మాకు తెలంగాణ ఏర్పాటు తర్వాత జీవనోపాధి కరువైంది
కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు గౌరవం అని చెప్పి సాంస్కృతిక సారథి పేరుతో వాళ్లకు నచ్చిన వారికే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా 550 మందికి నెలకు 25000 వెల రూపాల వేతనం ఇస్తు కేవలం వారితోనే సంక్షేమ పథకాలు ప్రచారం చేయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలమంది కళాకారుల బతుకులు బాజరుపాలు చేసింది అని అన్నారు.
బతుకుదెరువు కొరకు ఇక్కడనో అక్కడనో ఏవైనా ప్రైవేట్ ప్రోగ్రాంలు చేసుకొని బతుకుతున్న నిరుద్యగ కళాకారులకు సారథి కళాకారులే పెద్ద శత్రువులుగా మారుతున్నారు .
ప్రభుత్వం నుండి వచ్చిన వేతనం సరిపోలేదు అన్నట్టు మళ్ళీ ప్రైవేట్ ప్రోగ్రాంలు రాజకీయ పార్టీలు చేసే ప్రచారాల ప్రోగ్రాంలాల్లో కూడా అడ్డు పడి నాయకులతో ఎక్కువ డబ్బులు మాట్లాడుకొని మళ్ళీ మా నిరుద్యోగ కళాకారులకు కమీషన్ లకు ఇచ్చి చేయిస్తున్నారు
అక్కడ వారే ఇక్కడ వారే రికార్డింగ్ లో వారే
ఇంకా ఉద్యోగం రాని నిరుద్యోగ కళాకారులు బతకకుండ చేస్తున్నారు.
కాబట్టి
దయచేసి అన్నీ రాజకీయ పార్టీల నాయకులరా
మీరు అయినా ఆలోచించి
సాంస్కృతిక సారథిలో జీతం తీసుకుంటున్న వారికి మీరు ప్రోగ్రాంలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు అని స్థానికంగా ఉండే నిరుద్యోగ కళాకారులకు ప్రోగ్రామ్స్ ఇవ్వండి, సాంస్కృతిక షారధి ఉద్యోగులకు ప్రోగ్రామ్స్ ఇవ్వొద్దు
ఒక వేళ ఎక్కడైనా ఈ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు పాటలు పాడుతూ కన్పించిన లేదా
ప్రోగ్రాం పట్టుకొని కమీషన్లకు ఇచ్చినట్టు తెలిసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని
తప్పకుండా డి పి ఆర్ ఓ కలెక్టర్ కు పిర్యాదు చేసి వారిని సస్పెండ్ చేసేవరకు ఉరుకోము అని అన్నారు