రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన అంబులెన్స్ ను ప్రారంభించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. మండలంలోని తిర్మలాపూర్, శ్రీరాములపల్లి, రామడుగు, షానగర్ గ్రామాలలో ప్రజాహిత యాత్ర కొనసాగింది. రామడుగు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్లీ ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్ని సర్వేలు ఇదే చెబుతున్నయి, అలాంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే, అప్పుల్లో తెలంగాణను ఆదుకోవాలంటే నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోయి నిధులు తీసుకొస్తారా?’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణలోనూ బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి అత్యధిక నిధులు తెలంగాణకు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాముడి గుడి కడుతారని ఎప్పుడైనా అనుకున్నారా? రాముడు గుడి గురించి తరతరాలు చెప్పుకుంటారు. రాముడి గుడి కట్టిన మోదీకి ఓటు వేయాలా? వద్దా? మీకోసం మేము, శోభక్క కొట్లాడినం, మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారని, నాపై వంద కేసులు ఉన్నాయి. మీకోసం పదహారు వందల కి.మి. తిరిగినా, మాబతుకులు ఆగం చేసుకున్నాం. మీరు మాత్రం కాంగ్రెస్ ఓటేశారు. చొప్పదండి నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల కోసం 167కోట్ల 47లక్షలు, రోడ్ల మెటీరియల్ కోసం 72కోట్ల 91లక్షలు, చెట్ల పెంపకం కోసం 88కోట్ల 52లక్షలు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. రేషన్, వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు అంటే మోదీ అంటారు? మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారు ఎందుకు అక్క, అన్ని పనుల కోసం మోదీ నిధులు ఇచ్చారు అంటారు. ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారు. ఈసారి అలా చేయకండి దయచేసి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు హామీలు పూర్తి కాలేదని, గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీద ఉంటేనే అమలు, ఢిల్లీలో మళ్ళీ వచ్చేది మోదీ ప్రభుత్వమే, కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ప్రయోజనం ఉండదని, పంట నష్టపోయిన రైతులకు లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు, ఒక్క రూపాయి ఇవ్వలేదని, మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ గ్యాస్ మీద వంద రూపాయలు తగ్గించారని, రైతులకు సబ్సిడీల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎకరానికి పదిహేను వేల వరకు సహాయం చేస్తున్నారని, నరేంద్ర మోడీ ప్రధాని కాకుంటే రేషన్, సబ్సిడీలు ఆగిపోతాయని, దయచేసి ఆలోచించండి ఎన్నికలు వస్తున్నాయి, మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నేను వెళ్లి మోదీకి ఓటేస్తా, జీతాలు ఇచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఎలా అమలు చేస్తుందని, ప్రధాని అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రయోజనం లేదన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి, తిర్మలాపూర్ ఎంపిటిసి మోడీ రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, బూత్ కమిటీ అధ్యక్షులు పల్లపు చిరంజీవి, రేండ్ల తిరుపతి, సిరిపురం శంకర్, ఎగుర్ల రవి, ఎపురి పర్శరం, సత్తు రాకేష్, తదితరులు పాల్గొన్నారు.