గోధూరు వాసికి డాక్టరేట్ అవార్డు
మెట్ పల్లి నేటి ధాత్రి
ఇబ్రహీంపట్నం మండలంలోని గోధుర్ గ్రామానికి చెందిన బూరం సంజీవ్ సీనియర్ జర్నలిస్టుకు టోలాస మెక్సికో (అమెరికా) యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డు నుఈనెల 14వ తేదీన ఔరంగాబాద్ లో ప్రధానం చేయడం జరిగింది . బూరం సంజీవ్ గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతూ ప్రజా సమస్యలపై అనేక కథనాలు రాసినందుకు గౌరవ డాక్టరేట్ అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం బూరం సంజీవ్ టీ యు డబ్ల్యు జే (ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ రావడానికి కృషి చేసిన యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ కాయితి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు మాసుల ప్రవీణ్,మెట్టు దాస్ తదితరులు పాల్గొన్నారు.
