లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి;
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఆదరించి మళ్లీ గెలిపించాలని ఆయన కోరారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లక్షేట్టిపేట మండలంలోని బలరావుపేట,జెండా వెంకటాపూర్,తిమ్మాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఉందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.సాగునీరు, విద్యుత్ రంగాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి వ్యవసాయాన్ని పండగలా మార్చారని గుర్తు చేశారు.ఈ ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పిటిసి ముత్తె సత్తయ్య,డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగయ్య,మాజీ డీసీఎంఎస్ చెర్మాన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు, ఎంపిటిసిలు,వార్డు మెంబర్లు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.