జీహెచ్ఎంసీలో విలీనమైన మేడ్చల్ నియోజకవర్గంలో డివిజన్లు పెంచాలి
* మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
* రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ లకు వినతి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 16 :
జీహెచ్ఎంసీలో విలీనమైన మేడ్చల్ నియోజకవర్గంలో జనాభా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు డివిజన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ లను మంగళవారం కలిసి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ
డివిజన్ల సంఖ్య పెరిగితే ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించడానికి, పాలన మరింత సమర్థవంతంగా సాగడానికి అవకాశం ఉంటుందన్నారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, మేడ్చల్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మాజీ మేయర్లు తోటకూర అజయ్ యాదవ్, అమర్ సింగ్, పలువురు మాజీ కార్పోరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
