భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ ఉద్యానవనంలో సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి సుభాష్ కాలనిలోని ఆచార్య జయశంకర్ ఉద్యాన వనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.
ఉద్యానవనంలోని ఓపెన్ జిమ్, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ఆట వస్తువులను పరిశీలించారు. పిల్లల ఆటవస్తువులు శిధిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో కొత్త ఆటవస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపెన్ జిమ్ ప్రాంగణంలో వేసిన రబ్బరు టైల్స్ పాడైపోయాయని వాటిని మార్చాలని, ఓపెన్ జిమ్ పరికరాలను మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఉద్యానవనంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ బావుందని సంతృప్తి వ్యక్తం చేశారు. జయశంకర్ ఉద్యానవనం అభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలు రూపొందించాలని మున్సిపల్ అధికారులను అదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, పట్టణ ప్లానింగ్ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.