ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం అర్సం లోహిత్ వర్మ పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా లోహిత్ వర్మ మాట్లాడుతూ… మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులు జరగబోవు పరీక్షలకు శ్రద్ధగా చదివి , పరీక్షలు రాయాలని మంచి గ్రేడింగ్ లో ఉత్తీర్ణులై తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులను ప్రోత్సాహ పరిచేందుకు పరీక్ష కావాల్సిన సామాగ్రి పెన్నులు, ప్యాడ్స్ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర ఉపాధ్యాయులు రవి ,తిరుపతి, రవీందర్ , ఉపాధ్యాయునిలు ఝాన్సీ, రాధిక ,అంజలి, స్వర్ణలత, గ్రామ యువకులు ,ఎన్నం శ్రీధర్, ముదాం విజయ్, బొడమ్మల నితీష్, చింతం శ్రీను, కోన రమేష్ విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version