-పేదింటి బిడ్డ పెండ్లికి రూ.10వేల ఆర్థిక సాయం
-‘ఆది’ ఆదేశాలతో ఆడబిడ్డ కుటుంబ సభ్యులకు నగదు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
-ఆనందం వ్యక్తం చేస్తూ, ఆదికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన యువతి కుటుంబ సభ్యులు
-ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు
కథలాపూర్, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కథలపూర్ మండలం తుర్తి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వెంగల రాధ-సురేష్ దంపతుల కుమార్తె
హారిక వివాహం ఈనెల 29న కరీంనగర్ లో జరగనుంది
అయితే యువతిది నిరుపేద కుటుంబం కావడంతో ఆమె వివాహానికి తన వంతు సాయంగా రూ.10వేల ఆర్థిక సాయం అందించి ఆపదలో అండగా నిలిచాడు ‘ఆది’
‘ఆది’ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తుం మధు, కనికరపు రాకేష్, ఖమ్మం గణేష్, హరీష్ ఇతర నాయకులు వేములవాడ పట్టణంలోని 12వ వార్డ్ సాయి నగర్ లో నివాసం ఉంటున్న హారిక తల్లిదండ్రులకు నగదు అందజేశారు.
ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపదలో అండగా నిలిచిన ‘ఆది’కి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.